సికింద్రాబాద్ కంటోన్మెంట్:07-10-2025: ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించిన తరహాలోనే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని కంటోన్మెంట్ కాంగ్రెస్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమవంతు కృషి కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రితో పాటు పలు శాఖల మంత్రులు నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధిని గుర్తించి మళ్లీ అదే పార్టీకే పట్టం కడతారని గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ఇప్పుడు మాత్రం ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని, ఇది పార్టీకి మరింత బలాన్నిస్తుందని ఆయన అన్నారు.