
విజయవాడ: 05-12-25:-తణుకులో ఈ నెల 14వ తేదీ ఆదివారం జరగనున్న కాపుల ఆత్మీయ సమావేశం–ఆత్మీయ కలయిక కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కె.ఆర్.పి.ఎస్ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో సమావేశం పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ రంగాలలో పనిచేస్తున్న మేధావులతో సహా కుటుంబ సమేతంగా అందరిని ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈ సభ సమైక్యతకు ప్రతీకగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజా కాపునాడు–కె.ఆర్.పి.ఎస్ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ మసాబత్తుల శ్రీనివాస్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు యర్రంశెట్టి అంజిబాబు, నాయకులు వలవల శ్రీధర్, కాకిలేటి సురేష్, బసవ సురేష్ తదితరులు పాల్గొన్నారు.







