
గుంటూరు:-ఎన్టీఆర్ గారు మన మధ్య లేకపోయి 30 ఏళ్లు అవుతున్నా, తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని జన చైతన్య ప్రాపర్టీస్ అధినేత మాదల చైతన్య అన్నారు.

ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు నగరంలోని ఐపిడి కాలనీ 5వ లైన్ వద్ద కాకతీయ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు మాదల చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాదల చైతన్య మాట్లాడుతూ, తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరం స్థాయికి తీసుకెళ్లిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి రాజకీయ చరిత్రలో చెరిగిపోని అధ్యాయాన్ని సృష్టించారన్నారు. దేశానికి సుపరిపాలనకు అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.

సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని, విద్యావంతులు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ టికెట్లు ఇచ్చారని గుర్తు చేశారు. అనేక మంది మేధావులు, సమర్థులు, విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన దూరదృష్టి గల నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు.Guntur nagaram lo
ఈ కార్యక్రమంలో కాకతీయ సేవ సమితి ప్రతినిధులు గోగినేని హరికృష్ణ, గోగినేని శంకర్రావు, బత్తిన శివయ్య, ఆలపాటి వెంకట కృష్ణ, చల్లగుండ్ల వెంకటేశ్వరరావు, ఈదర శ్రీనివాసరావు, పాటిబండ్ల శ్రీనివాసరావు, కందిమల్ల హరికృష్ణ, పుట్టగంటి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










