
కలిదిండి, ఫిబ్రవరి 6:-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు గురువారం కలిదిండి మండలంలోని కలిదిండిలో భోగేశ్వరం గ్రామంలో ఉన్న శ్రీ పార్వతి సమేత పాతాళ భోగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్‌తో పాటు పాలక మండలి సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
దేవస్థానంలో నూతన ప్రకార మండప నిర్మాణ పనుల సమయంలో శిథిలావస్థలో ఉన్న పురాతన శివలింగం వెలుగులోకి వచ్చిన విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. శివలింగాన్ని దర్శించిన డా. కామినేని శ్రీనివాస్ గారు, దానిని దేవస్థానంలో భద్రపరచాలని ఆలయ సిబ్బందికి, పాలక కమిటీ సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఆలయ ప్రకార మండప నిర్మాణానికి సహకరించిన దాతలను ఎమ్మెల్యే సత్కరించారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు మరిన్ని దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.Amaravathi Local New
ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు గారు, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు గారు, ఎన్డీఏ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










