
NTR విజయవాడ:17-10-25:- విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారిని తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్. రవి శుక్రవారం నాడు దర్శించుకున్నారు.

ఆలయానికి విచ్చేసిన గవర్నర్‌కు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
దేవస్థాన ఆచారసూచుల ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు గవర్నర్‌కు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదంగా లడ్డూ మరియు అమ్మవారి చిత్రపటాన్ని గవర్నర్‌కు అందజేశారు.దర్శనానంతరం ఆలయ ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లలో డోనర్లతో కలిసి భోజన సేవను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శ్రీ శీనానాయక్, ప్రధాన అర్చకులు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.







