కూటమి ఏడాది పాలనలో గ్రామాల్లో అభివృద్ధికి పెద్ద పీట:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల
గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడులో రూ.33 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించిన నాయకులు
వడ్లమన్నాడు పాల కేంద్రం నూతన కమిటీని అభినందించిన…ఎమ్మెల్యే రాము, కొనకల్ల,రావి
గ్రామాల సమగ్ర అభ్యున్నతికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి: కూటమినేతలు
గుడ్లవల్లేరు జూలై 11:గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావులు పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభ్యున్నతి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు.
గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో రూ. 33 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాము, కొనకల్ల, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రావి వెంకటేశ్వర్రావు మరియు, కూటమినేతలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం పాల కేంద్రం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, నూతన అధ్యక్షుడు పుల్లేటి రాజా ప్రసాద్ మరియు కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. గత ఐదేళ్లుగా గ్రామాలు అభివృద్ధికి మంజూరైన నిధులను కూడా అరాచక ప్రభుత్వం పక్కదారి పట్టించిదని, స్థానిక సంస్థలకు విలువలేకుండ చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించడంతోపాటుగా, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ… అభివృద్ధికి దూరమైన కృష్ణా జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. కృష్ణాజిల్లాలోని నాయకత్వం అంత ఏకతాటిపైకి వచ్చి, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో
గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలను పరిష్కరించినట్లు కొనకల్ల నారాయణరావు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సాయిన పుష్పావతి , మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, మండల టిడిపి నాయకులు పోలవరపు వెంకటరావు,సురగని ప్రసాద్,కొడాలి రామరాజు,కాగిత నరేంద్ర,నరఘని శ్రీనివాసరావు, బొల్లా అందాలు ,పామర్తి కన్య భాస్కరరావు,ఆకుల శివయ్య,దేవిశెట్టి రామకృష్ణ,S ప్రసాద్ ,పాలేటి ఆంజనేయులు,సమ్మెట సాంబయ్య,దారా సత్యనారాయణ,ఈడే మోహన్,మన్యం నరసింహారావు, కంచర్ల ప్రకాష్, మద్దాల జోజిబాబు,నిమ్మగడ్డ సత్యసాయి,కంచర్ల సుధాకర్,సురగాని సూరిబాబు ,అబ్దుల్ సత్తార్,బెజవాడ రాంబాబు,చిట్టిబొమ్మ నరసింహారావు,సారధి…. వడ్లమన్నాడు నాయకులు పామర్తి సత్తిబాబు, పామర్తి సూరిబాబు, మోదుగమూడి కోటేశ్వరరావు, పండే శ్రీను, మెండ నాంచారయ్య, పెన్నేరు రమేష్, గరికపాటి రాంబాబు, గరికిపాటి వెంకటేశ్వరరావు, గరికపాటి నాగేశ్వరరావు, లక్ష్మయ్య, పుల్లేటి కిషోర్, కొనతం పెద్దిరాజులు, చింతయ్య, రాజబాబు, మండల సుబ్బారావు, తోట రమేష్,…..పాల కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్ పుల్లేటి రాజా ప్రసాద్ , మేనేజర్ తోట సత్యనారాయణ,
సూపర్వైజర్ పెయ్యటి బసవరాజ్ కుమార్,
వేతన కార్యదర్శులు వేముల వీర కొండలరావు,
టేస్టర్ RVN పవన్ సాయి, స్థానిక ప్రజలు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.