బాపట్ల
KARAMCHEDU NEWS:మాజీ జెడ్పిటిసి వీర వసంతకుమారి మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సంతాపం
కారంచేడు కు చెందిన మాజీ జడ్పిటిసి శ్రీమతి జాగర్లమూడి వీరవసంతకుమారి వీరమ్మ (జెఆర్ కె సతీమణి) మృతి పట్ల తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆమె మరణం చాలా బాధాకరమన్నారు. ఆమె మృతి తెలుగుదేశం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటు అన్నారు. జడ్పిటిసి గా కారంచేడు మండల అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆమె చేసిన కృషిని కొనియాడారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.