
బాపట్ల జిల్లా:పర్చూరు:చినగంజం:13-11-25:-స్థానిక శ్రీ లలితా సమేత రామకోటేశ్వర స్వామి ఆలయంలో గురువారం కార్తీక మాస వనభోజన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. కీర్తిశేషులు తుమ్మలపెంట పెద్ద రామారావు గారి ధర్మపత్ని రాజేశ్వరమ్మ కుటుంబ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ టి.ఎస్.ఆర్. రామాంజనేయులు దంపతులు ఈ కార్యక్రమాన్ని సమన్వయించారు.
కార్తీక మాస పూజా కార్యక్రమంలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని భక్తి పరవశంగా దీపారాధన నిర్వహించారు. ఉసిరి చెట్టు ప్రాంగణంలో అర్చకులు శంకరమంచి హనుమంతరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వనభోజన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు







