

కార్తీక వనసమారాధన ఆధ్యాత్మిక చింతన, ఆనందం ఆరోగ్యం సందేశం కలయిక….కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన
ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, వసంత కృష్ణ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ వెల్లడి
140 మంది పేద విద్యార్ధులకు రూ.14 లక్షల సాల్కర్ షిప్ లు అందజేత
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ :
కార్తీక వనసమారాధన ఆధ్యాత్మిక చింతన, ఆనందం ఆరోగ్యం సందేశం కలయిక అని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. పేదవారికి సాయం చేసేందుకు అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే సమాజంలో మార్పు సాధ్యమన్నారు.
కార్తీక మాసం సందర్భంగా ఆదివారం నందిగామలోని నెహ్రు నగర్ కమ్మ కళ్యాణ మండపంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో వనసమారాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం , విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ , ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు.
నందిగామ చిరుమామిళ్ల శేషాద్రి నాయుడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ వనసమారాధనలో, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు , చిరుమామిళ్ల శేషాద్రి నాయుడు చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు ప్రజలతో కలసి ఆధ్యాత్మిక కార్తీక వన సమారాధన వాతావరణాన్ని ఆస్వాదించారు.
ఆధ్యాత్మికతతో కూడిన వనభోజనం కార్తీక వనభోజనాలు మనకు ఆనందం, ఆరోగ్యం, ఐక్యత అనే సందేశాన్ని అందిస్తాయని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. సమాజంలో మార్పు రావాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉండి పేదవారికి తోడ్పాటు అందించాలనే ఆవశ్యకతను వారు స్పష్టం చేశారు.
సేవా కార్యక్రమంలో భాగంగా కమ్మ సంఘం ఆధ్వర్యంలో 140 మంది పేద విద్యార్థులకు మొత్తం 14 లక్షల రూపాయల స్కాలర్ షిపులు అందజేయడం జరిగినది. ఈ సహాయం విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడుతుందని, సమాజంలో సమానత్వం పెంపొందుతుందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి , మాజీ ఎమ్మెల్యే బొద్దులూరి రామారావు , కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కోగంటి బాబు , విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ బోర్డ్ సభ్యురాలు మన్నే కళావతి, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సజ్జా అజయ్, కామినేని కోటేశ్వరరావు లతో పాటు కమ్మ సంఘం సభ్యులు, కూటమి నేతలు, మహిళలు, యువతి యువత, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







