
కొండవీటి కోట సమీపంలోని మామిడి తోటల్లో కార్తీక మాస వన సమారాధన మహోత్సవాలు భక్తి–సాంస్కృతిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం మూడో వారం ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు, కుటుంబాలు పాల్గొన్నారు.
విద్యార్థులు, విద్యార్థినులు చక్కని ఆటపాటలతో సందర్శకులను ఆకట్టుకున్నారు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు పరస్పరం పలకరించుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సమయాన్ని గడిపారు.
గుంటూరు వన్ డిపో టు డిపో ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని, నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అనంతరం మామిడి చెట్ల మధ్య ఏర్పాటు చేసిన వనభోజనాలను అందరూ ఆరగించి ఆనందంగా, ఉత్సాహంగా గడిపిన దృశ్యాలు కనిపించాయి.
కి











