
ఏలూరు: 23-10-25:-కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ టూర్ ప్రోగ్రాంలను ప్రారంభించింది. ఈ విషయాన్ని ప్రజా రవాణా శాఖ అధికారి షేక్ షబ్నం తెలిపారు.కార్తీక మాసంలోని ప్రతి సోమవారం ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపో నుంచి ప్రత్యేక బస్సులు సాయంత్రం పూట బయలుదేరి, భక్తులను అమరావతి సహా పంచరామ శైవ క్షేత్రాలకు తీసుకువెళ్తాయని తెలిపారు. భక్తులు సులభంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకునేందుకు సౌకర్యవంతమైన ప్యాకేజీలను రూపొందించామని పేర్కొన్నారు.
అంతేకాకుండా కార్తీక మాసంలో విద్యార్థులు, అయ్యప్ప భక్తుల కోసం కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. భక్తులు ఏపీఎస్ఆర్టీసీ అందించే ఈ ప్రత్యేక సదుపాయాలను వినియోగించుకొని దైవదర్శనం చేయాలని షేక్ షబ్నం సూచించారు.







