
గుంటూరు సమీపంలో ఉన్న కౌడెన్య ఐఏఎస్ అకాడమీని KSR నేతాజీ మిత్ర మండలి చైర్మన్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు శనివారం సందర్శించారు. అకాడమీ చైర్మన్ E.V. నారాయణ ఆహ్వానం మేరకు జరిగిన ఈ సందర్శనలో ఆయన సంస్థలో ఉన్న వసతులు, శిక్షణా విధానాలను పరిశీలించారు. సంస్థ నిర్వహణను పూర్తిగా స్వంత నిధులు మరియు దాతల సహకారంతో కొనసాగిస్తూ, కొద్ది ఫీజులతో పేద విద్యార్థులకు శిక్షణ అందించడం ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. ఐఏఎస్, బ్యాంకింగ్, RRB, LIC వంటి పోటీ పరీక్షల కోసం ఏడువేల రూపాయలతో కోచింగ్ అందించడం అరుదైన విషయం అని అభిప్రాయపడ్డారు.
విద్యార్థులతో మాట్లాడిన శ్రీనివాసరావు, కృషి మరియు ఏకాగ్రత ఉన్నప్పుడు ఉన్నత స్థానాలు సాధించగలరని అన్నారు. పాఠాలు వినేటప్పుడు, చదువుకునేటప్పుడు, ఆలోచనలో, మాటల్లో ఏకాగ్రత ఉంటే విజయం సాధ్యమవుతుందని సూచించారు. సరైన వసతులు లేని సమయంలోనే అబ్దుల్ కలాం, అంబేద్కర్, నారా చంద్రబాబు నాయుడు వంటి పలువురు కష్టంతో ఉన్నత స్థానాలు అందుకున్నారని గుర్తుచేశారు. వారిని ఆదర్శంగా తీసుకొని లక్ష్య సాధనలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మోటివేషన్ స్పీకర్ ప్రత్యూష సుబ్బారావు విద్యార్థులకు నైతిక విలువలు, చదువుపై అవగాహన, లక్ష్య సాధనపై మార్గదర్శక తరగతి నిర్వహించారు. ప్రిన్సిపల్ కరంచంద్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.








