
గుంటూరు జిల్లా, నవంబర్ 4:_ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న “రచ్చబండ” కార్యక్రమం భాగంగా ఈరోజు ఉదయం కాకుమాను మండలం, కె.బి. పాలెం గ్రామంలో రచ్చబండ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ శ్రీ బలసాని కిరణ్ కుమార్ గారు నేతృత్వం వహించారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి సంతకాల సేకరణ చేపట్టి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల అభిప్రాయాలను నమోదు చేశారు. అనంతరం గ్రామ కమిటీలను పూర్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు మరియు తెనాలి నియోజకవర్గ పరిశీలకులు షేక్ గులాం రసూల్ గారు, కాకుమాను మండలం మరియు కె.బి. పాలెం గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం కోసం నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించకూడదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై పోరాటాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
 
 






