Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈనెల 14న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు-బిఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్, ఫిబ్రవరి:-తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Hyderabad Local News :కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈనెల 14న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు-బిఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్

బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీ ప్రాంగణంలో పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన పోరాట పటిమను విద్యార్థులకు తెలియజేయడం లక్ష్యంగా “తెలంగాణ జాతిపిత కేసీఆర్” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

గోషామహల్ నియోజకవర్గంతో పాటు నగరంలోని ప్రధాన పాఠశాలలు, కళాశాలల్లో ఫిబ్రవరి 14న ఈ పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో ఉత్తమ వ్యాస రచనకు రూ.5,000 నగదు పురస్కారం అందజేస్తామని తెలిపారు.Hyderabad Local News

కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా పేర్కొనడంపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉలిక్కిపడుతున్నారని గడ్డం శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. పోటీల్లో విద్యార్థులు రాసిన ఉత్తమ వ్యాసాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంఓ) పంపిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, విద్యార్థులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker