
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 09, 2026:-రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీకి పర్యటించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల విడుదల, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం విస్తృతంగా చర్చించనున్నారు.
ఈ సందర్భంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీడీపీ సహచర ఎంపీలతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సీఎం పర్యటనకు మద్దతు తెలిపారు.Amravathi cabinet :రాష్ట్ర క్యాబినెట్ ప్రధాన నిర్ణయాలు-రాష్ట్ర సమాచార శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారథి
రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో సీఎం పర్యటన కీలకంగా మారనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులతో జరిగే భేటీలు రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలకు దారితీయనున్నాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.










