chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జాతీయ సార్వత్రిక సమ్మె-మొగుళ్ళ రాజిరెడ్డి పిలుపు

హైదరాబాద్, ఫిబ్రవరి 11:- కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించనున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో జలమండలి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జలమండలి ఉద్యోగుల యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల సమాఖ్య ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జలమండలి ఉద్యోగులతో పాటు ఐ.ఎన్.టి.యు.సి కి అనుబంధంగా ఉన్న అన్ని సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొనాలని కోరారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ సవరణ చట్టం–2025, వీబీజి రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లులు వంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఎల్ఐసీలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు ఉద్యోగుల భవిష్యత్తుకు హానికరమని ఆయన పేర్కొన్నారు.

సమ్మె సందర్భంగా ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి నుండి ఇందిరా పార్క్ వరకు కేంద్ర కార్మిక సంఘాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో జలమండలి ఉద్యోగులు, ఐ.ఎన్.టి.యు.సి నాయకులు మరియు కార్మికులు పెద్దఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని మొగుళ్ళ రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.Hyderabad naampalli

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ విధానాలపై ప్రజాభిప్రాయం వ్యక్తం చేయడానికి ఈ సమ్మె ఒక చారిత్రాత్మక అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker