chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా

Kodangal Local News :కొడంగల్‌లో మున్సిపల్ ఎన్నికల సందడి – సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉప్పల్ కాంగ్రెస్ నేతలు

కొడంగల్, ఫిబ్రవరి :- రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి , గడ్డం రవికుమార్ , ఉప్పల్ ‘ఏ’ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సుర్వి మురళి గౌడ్ , రామంతపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తవిడబోయిన గిరిబాబు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగగా భావించి ప్రజలు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన తెలిపారు.

సీఎంను కలిసిన ఉప్పల్ కాంగ్రెస్ నాయకులు తమ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం, మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు, స్థానిక అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఉప్పల్, రామంతపూర్ ప్రాంతాల్లో పార్టీకి మంచి స్పందన వస్తోందని వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.Hyderabad Local news:CM రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

ఈ భేటీ సందర్భంగా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ ఓటరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజల్లో మంచి సందేశం పంపిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

మొత్తానికి, కొడంగల్‌లో జరిగిన ఈ భేటీ మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపినట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker