
ప్రత్తిపాడు మండలం బోయపాలెం నుంచి చినకొండ్రుంపాడు గ్రామం వరకు నిర్వహించిన ర్యాలీలో గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు పాల్గొన్నారు. అనంతరం కోండ్రుంపాడు సొసైటీ చైర్మన్గా నియమితులైన శ్రీ మారాచు శ్రీనివాసరావు గారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు గారు మాట్లాడుతూ, రైతులకు అవసరమైన సహాయ సహకారాలను సమర్థవంతంగా అందించాలని, సొసైటీ అభివృద్ధిలో చైర్మన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సొసైటీ పనిచేయాలన్నారు.

అనంతరం నూతన చైర్మన్ శ్రీ మారాచు శ్రీనివాసరావు గారిని శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.Guntur Local News










