
Eluru:పోలవరం: కొయ్యలగూడెం:13-11-2025:-పోలవరం నియోజకవర్గం కూటమి కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ & తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొరగం శ్రీనివాసులు గారు రేపు (14-11-2025) “గ్రీవెన్స్ కార్యక్రమం”ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమం కొయ్యలగూడెం మండలం మార్కెట్ యార్డ్‌లో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరగనుంది. పార్టీ జాతీయ కార్యాలయం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో, నియోజకవర్గ ప్రజలు తమ CMRF ఫైళ్లు లేదా ఇతర సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించవచ్చని తెలిపారు.
స్వీకరించిన అన్ని దరఖాస్తులను జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బొరగం శ్రీనివాసులు గారు తెలిపారు.నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలంతా ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.







