
కృష్ణాజిల్లా:గుడివాడ పట్టణంలోని 33, 34,35… వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు’ ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు.ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, పార్టీ నేతలతో కలిసి… ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థిక సమస్యలు తలెత్తిన ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అధికారంలోకి చ్చిన ఏడాదిలోనే ఇంటింటికి సంక్షేమాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఎమ్మెల్యే రాము వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.







