కృష్ణాజిల్లా:గుడివాడ లో కే.కన్వెన్షన్ హాల్లో ” రీకాలింగ్ చంద్రబాబు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ”ప్రోగ్రాం వై.ఎస్.ఆర్.సిపి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ప్రతిఒక్కరు వచ్చి జయప్రదం చేయాలని వైసిపిపట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ!ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సమావేశాన్ని నియోజకవర్గ వైసిపి నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలోపేయ్యల ఆదాం, పాలేటి చంటి, మట్ట జాన్ విక్టర్, ఎం. వి నారాయణరెడ్డి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్, అడపా పండు, తదితరులు పాల్గొన్నారు
228 Less than a minute