కృష్ణాజిల్లా:గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాడమాసం శ్రీ శాకంబరీదేవి మహోత్సవవేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము,ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర్రావు తో కలిసి అమ్మవారికి సారే(పట్టు వస్త్రాలను) సమర్పించి, ప్రత్యేక పూజలునిర్వహించారు.ఆయనమాట్లాడుతూ!ప్రసిద్ధిగాంచిన అమ్మవారి దేవస్థానంలో ఆషాడ మాసోత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమ న్నారు.ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, ఎలవర్తి శ్రీనివాసరావు దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
230 Less than a minute