
Krishna:మచిలీపట్నం, అక్టోబర్ 19:-కృష్ణాజిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.దీపావళి పండుగను కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.చిన్న పిల్లలు బాణసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని ఎస్పీ సూచించారు. అధిక శబ్దం కలిగిన బాణసంచా కాల్చేటప్పుడు తోటి వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండి ప్రజా భద్రతను కాపాడాలని సూచించారు.అనధికారికంగా బాణసంచా నిల్వలు ఉంచినట్లయితే వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. బాణసంచా విక్రయదారులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయన హెచ్చరించారు.“ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలు లేని, సురక్షితమైన దీపావళి జరుపుకోవచ్చు,” అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు.







