విద్యానగర్ పార్క్ బిల్డింగ్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, నేతాజీ మిత్ర మండలి చైర్మన్, ఆంధ్రరత్న సామాజిక సేవారత్న అవార్డు గ్రహీత కొమ్మాలపాటి శ్రీనివారావు (KSR) జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా KSR మాట్లాడుతూ:“పుట్టినరోజు సందర్భంగా మా గ్రామం పూసపాడు లోని NTR ఆడిటోరియంకు నేను, తల్లపనేని నాగేశ్వరరావు కలిసి జనరేటర్ విరాళంగా అందించాం. ఇకపై కూడా సమాజానికి సేవలు అందిస్తాం” అని తెలిపారు.
కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, చాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏల్చురి వెంకటేశ్వర్లు, బలరామకృష్ణ స్పిన్నింగ్ మిల్స్ అధినేత బలరామకృష్ణయ్య, సాయిబాబా గుడి చైర్మన్ యడ్లపల్లి అశోక్ కుమార్, LVR క్లబ్ మాజీ ప్రెసిడెంట్ వడ్లమూడి శివరామకృష్ణ, మైనేని రామ్ ప్రసాద్ పాల్గొన్నారు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పుర ప్రముఖులు, NTR మిత్ర మండలి, నేతాజీ మిత్ర మండలి, RP మిత్ర మండలి, పార్క్ మిత్ర మండలి డైరెక్టర్లు, సభ్యులు హాజరయ్యారు.