
చీరాల: నవంబర్ 29:-కుందేరు వాగులో నీటి ప్రవాహం తగ్గిన వెంటనే డ్రైనేజ్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాల్సిందిగా సంబంధిత శాఖలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐఏఎస్ ఆదేశించారు. శనివారం రాత్రి చీరాల–బాపట్ల మధ్య ప్రవహించే కుందేరు వాగును స్వయంగా పరిశీలించిన కలెక్టర్, పరిస్థితులను ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, తహశీల్దార్ గోపికృష్ణ, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు.

తాజా వర్షాలతో వాగులోకి భారీగా వచ్చిన నీరు సంక్రాంతి వద్ద ఆగిపోవడంతో గట్టు ప్రదేశాలు దెబ్బతిని, నీరు పొలాల్లోకి చేరి రైతులు నష్టపోయిన పరిస్థితిని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిన వెంటనే డ్రైనేజ్ సంబంధిత పనులు త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.పర్యటనలో అధికారులు డ్రైనేజ్‌ల ప్రస్తుత పరిస్థితి, మరమ్మతులకు అవసరమైన పనులపై కలెక్టర్‌కు వివరించగా, పనుల ప్రాధాన్యత, అత్యవసరత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.







