
గుంటూరు: నవంబరు 10 :-జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు చేపట్టిన Leprosy Case Detection Campaign (LCDC) సర్వే పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రచార పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో జరిగింది.కలెక్టర్ మాట్లాడుతూ ఈ సర్వేను నవంబరు 17 నుండి 30 వరకు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆశా కార్యకర్తలు, పురుష వాలంటీర్లు కలసి ఇంటింటికి వెళ్లి సర్వే చేపడతారని వివరించారు.
మొత్తం 5,56,616 గృహాలను 1,167 టీములు సందర్శించి కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించనున్నట్లు చెప్పారు. సర్వే ద్వారా గుర్తించిన రోగులకు అవసరమైన MDT మందులు ఉచితంగా అందించబడతాయని, ఈ మందులు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.“కుష్టు వ్యాధి భయపడాల్సిన అవసరం లేదు. సరైన చికిత్సతో ఇది పూర్తిగా నయమవుతుంది. అందువల్ల ఇంటింటికి వచ్చే ఆరోగ్య సిబ్బందికి సహకరించి పరీక్షలు చేయించుకోవాలి,” అని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీ కుమారి, డీఎంఎండ్హెచ్ఓ డా. విజయలక్ష్మి, పీడీ డీఆర్డీఏ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, పశుసంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఎస్.వి. రమణ, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, ఏడీ మైక్రో ఇరిగేషన్ వజ్రశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ చక్రవర్తి, కలెక్టరేట్ అధికారులైన పూర్ణ చంద్రరావు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.







