
పిట్టలవానిపాలెం:11-12-25:- మండలం ఖాజీపాలెం గ్రామంలోని కె.వి.ఆర్–కె.వి.ఆర్ & ఎం.కె.ఆర్ డిగ్రీ కళాశాల 45వ క్రీడా వార్షికోత్సవం, అలాగే డా. డి.యస్. రాజు జూనియర్ కళాశాల 29వ క్రీడా వార్షికోత్సవం సందర్బంగా కళాశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన క్రీడా పోటీలకు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు శుభారంభం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సభలోకి చేరుకోగానే విద్యార్థులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. అనంతరం క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన ట్రాక్‌పై తొలి పతకాల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే, వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు.కళాశాలల్లో చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఉందని, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వం, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వంగా సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు, అధ్యాపకులు, యాజమాన్య సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.







