
హైదరాబాద్: 23-11-25:-లేబర్ కార్డు ఉంటే కూలీలకు శ్రీరామరక్షలాంటిదని లేబర్ ఆఫీసర్ శిరీష పేర్కొన్నారు. గుడిమల్కాపూర్ ఎస్బిఐ కమ్యూనిటీ హాల్‌లో శ్రీ వెంకటేశ్వర లేబర్ అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 200 మంది కూలీలకు లేబర్ కార్డులను ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కార్డు ద్వారా లభించే ప్రయోజనాలు, దరఖాస్తు విధానం వంటి అంశాలను కూలీలకు శిరీష వివరంగా తెలియజేశారు.

త్వరలో మరో 300 మందికి లేబర్ కార్డులు అందజేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు శశి భూషణ్ తెలిపారు.కార్యक्रमంలో అసోసియేషన్ సభ్యులతో పాటు ముఖ్య అతిథులుగా స్థానిక నేతలు శ్రీధర్ సాగర్, నరసింహ, విశ్వేశ్వరరావు, దినేష్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.







