
వినుకొండ :- స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న లోయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ ఫాదర్ ప్రసాద్ ప్రార్థనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ, క్రీస్తు జన్మించి 2025 సంవత్సరాలు పూర్తవుతున్న జూబ్లీ సంవత్సరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, పెద్దలను గౌరవిస్తూ దేవుని ఆరాధించాలని సూచించారు.
ప్రధానోపాధ్యాయులు బాల శౌరయ్య మాట్లాడుతూ, తల్లిదండ్రులను గౌరవించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి దేవుని ఆజ్ఞలే మానవీయ విలువలకు పునాది అని తెలిపారు.Former MLA of Gurujala constituency Kasu Mahesh Reddy held a media conference in Narasaraopet, Palnadu district on Thursday.
అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, క్రిస్మస్ గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కులమతాలకు అతీతంగా విద్యార్థులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ కమిటీ సభ్యులు ప్రకాష్, బాబు మాస్టర్, ఉపాధ్యాయులు వీర, రాజేశ్వరి, అనీల, వాణి, అంజలి, శారద తదితరులు పాల్గొన్నారు.










