
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14:-లోక్‌సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ న్యూఢిల్లీలో నిర్వహించిన కీలక రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
“ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ ఆఫ్ ది బహాయీస్ ఆఫ్ ఇండియా” ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొని లింగ సమానత్వంపై విస్తృతంగా చర్చించారు.

“లింగ సమానత్వం కోసం కార్యాచరణ: ఇంటి నుండే ప్రారంభం” (Action for Gender Equality: Begin at Home) అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఎంపీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడంలో కుటుంబ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
బాల్య దశ నుంచే అబ్బాయిలు–అమ్మాయిలకు సమాన విలువలు నేర్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల సాధికారత కేవలం ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే కాకుండా, ప్రతి కుటుంబం చైతన్యంతో ముందుకు రావాలని సూచించారు.Bapatla Local News
ఈ కార్యక్రమం ద్వారా లింగ సమానత్వంపై అవగాహన పెంపొందించడంతో పాటు, సామాజిక మార్పు దిశగా కార్యాచరణ చేపట్టాలనే సంకల్పం వ్యక్తమైంది.










