
ఏలూరు:04-11-25:- లింగపాలెం సమీపంలోని జూబ్లీ నగర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరా తీశారు.ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఈ ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరంకి ప్రవీణ్ బాబు దుర్మరణం పాలైన విషయం తెలిసిన వెంటనే మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు

.ప్రమాదంలో మృతుడైన ప్రవీణ్ బాబు కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు.
అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన వారికి సమయానుకూలమైన వైద్యం అందించాలంటూ వైద్యాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.“బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుంది,” అని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.
 
 






