గుంటూరు, అక్టోబర్ 5:విద్యార్థులు లోకహితమైన విద్యను అభ్యసించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని అడిషనల్ ఎస్‌పీ హనుమంతు ఆకాంక్షించారు. ఈనెల 5వ తేదీన గుంటూరు నగరంలోని ఏసీ కళాశాల అసెంబ్లీ మందిరంలో మానవత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సభకు మానవత చైర్మన్ పావులూరి రమేష్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్‌పీ హనుమంతు మాట్లాడుతూ, క్రమశిక్షణ, సంస్కారాలతో కూడిన విద్యను విద్యార్థులు అభ్యసించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తే, మన దేశం వేగంగా అభివృద్ధి చెందగలదని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి శారీరకంగా, మానసికంగా ఎదగాలని విద్యార్థులను కోరారు.
కార్యక్రమంలో ఎన్ఎంఎంఎస్ శిక్షణ శిబిరానికి హాజరైన 600 మంది విద్యార్థులకు 500 పేజీలతో కూడిన స్టడీ మెటీరియల్ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు.
తూ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ ఇష్టపడి చదివి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌లను విద్యార్థులు అధిక సంఖ్యలో పొందేలా శిక్షణ ఇస్తున్న మానవత సంస్థ ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ శిక్షణతో పోటీ పరీక్షలకు బలమైన పునాది ఏర్పడుతుందన్నారు.
కార్యక్రమంలో మానవత కార్యదర్శి కె. సతీష్, డైరెక్టర్లు ఉప్పల సాంబశివరావు, చావా లక్ష్మి సామ్రాజ్యం, కృష్ణ ప్రసాద్, అధ్యక్షులు కోటా శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్స్ గేరా ప్రకాష్, ఆది నారాయణ, జగదీష్, బాబు, రెహమాన్, బేతపూడి మంగారావు తదితరులు పాల్గొన్నారు.