Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్తిరుపతి

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా

తిరుపతి, సెప్టెంబర్ 14: మహిళల ఆధ్వర్యంలోని అభివృద్ధి, బాలల సంక్షేమమే 2047 నాటికి వికసిత్ భారత్‌ దృష్టికోణానికి పునాది అని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఈ రోజు పార్లమెంట్‌ మరియు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీల చారిత్రక మొదటి జాతీయ సదస్సును తిరుపతిలో ప్రారంభించారు.ఆదివారం ఉదయం స్థానిక రాహుల్ కన్వెన్షన్ సెంటర్ నందు ఈనెల 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ మహిళా సాదికారత సదస్సును జాతీయ గీతం మరియు రాష్ట్ర గీతాలాపన అనంతరం పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి డి. పురందేశ్వరి, రాజ్యసభ ఉపాధ్యక్షుడు శ్రీ హరివంశ్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖా మాత్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర మహిళా సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవర లతో కలసి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.సభ ప్రారంభానికి ముందు సదస్సు ప్రాంగణానికి చేరుకున్న లోక్ సభ స్పీకర్ కు రాజ్య సభ ఉపాధ్యక్షుడు రాజ్యసభ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, ఉప సభాపతి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖా మాత్యులు, రాష్ట్ర మహిళా సంక్షేమ కమిటీ చైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ స్వాగతం పలికారు. తరువాత లోక్ సభ స్పీకర్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తిరుపతి ఎం.పి. గురుమూర్తి, చిత్తూరు ఎం.పి దగ్గుమల్ల ప్రసాద్ రావు, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, పూతలపట్టు, సత్యవేడు, నగరి, వెంకటగిరి, ఎం.ఎల్.ఎ లు, తుడా చైర్మన్ లోక్ సభ స్పీకర్ కు పుష్ప గుచ్చాలు అందించి, శాలువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆంద్ర ప్రదేశ్ శాసన సభ స్పీకర్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మరియు చేనేత జౌలి శాఖల మంత్రి సవిత, రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ,గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లను స్పీకర్ కు పరిచయం చేశారు. జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమీషనర్ ఎన్.మౌర్య స్పీకర్ కు పుష్ప గుచ్చాలు అందించారు. అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన కమిటీ సభ్యులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. తదనంతరం ఫోటో ఎక్జిబిషన్ ను ప్రారంభించి సభ్యులతో కలసి తిలకించారు.జ్యోతి ప్రజ్వలన అనంతరం వేదికపై ఉన్న లోక్ సభ స్పీకర్, రాజ్య సభ చైర్మన్ తదితర ప్రముఖులకు శాసన సభ సబాపతి, ఉప సభాపతి లు శాలువాలు కప్పి, శ్రీవారి చిత్రపటాలను బహుకరించారు. లోక్ సభ సెక్రటేరియట్ ద్వారా ప్రచురించిన సదస్సుకు సంబంధించిన సావనీర్ ను లోక్ సభ స్పీకర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ……భారతదేశం వికసిత్ భారత్‌గా మారాలంటే మహిళా సాధికారత, బాలల సంక్షేమమే పునాది కావాలని పేర్కొన్నారు. “మన కుమార్తెలు చదువుకొని స్వయం ఆధారితులైతేనే భారతదేశం సమగ్ర, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది” అని స్పష్టంచేశారు. ఈ రెండురోజుల సదస్సు “వికసిత్ భారత్‌ కోసం మహిళా ఆధ్వర్యంలోని అభివృద్ధి” అనే ప్రధాన అంశంతో జరుగుతోందన్నారు. ఇందులో జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ (లింగానుసార అనుకూల బడ్జెట్‌) మరియు కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళలకు సాధికారత అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయన్నారు. మహిళల సాధికారత అనేది ఒకేసారి జరిగే కార్యాచరణ కాదని, నిరంతర ప్రక్రియన్నారు. గ్రామపంచాయతీ నుండి పార్లమెంట్‌ వరకు మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సూచించారు. “అమృత్ కాలంలో నారీ శక్తి దేశాన్ని సమగ్రత మరియు శక్తివంతమైన భవిష్యత్తు వైపు నడిపించే అప్రతిహత శక్తిగా రూపుదిద్దుకుంటోంది” అని అన్నారు. మహిళల సమానత్వం, నాయకత్వం, భాగస్వామ్యం – న్యాయం మాత్రమే కాకుండా, సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి పునాది అని స్పష్టం చేశారు.మహిళల కృషి మరియు చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం, ధైర్యం భారత సమాజాన్ని సమానత్వ దిశగా నడిపిందన్నారు. రాజ్యాంగ సభలో 15 మంది మహిళలు పాల్గొని భారత రాజ్యాంగాన్ని లింగ సమానత్వానికి అనుగుణంగా రూపొందించారన్నారు. గార్గి, అనసూయ వంటి పండితులు, రాణి రుద్రమాదేవి, రాణి లక్ష్మీబాయి వంటి యోధులు, నేటి శాస్త్రం, క్రీడలు, సాంకేతికం, రాజకీయ రంగాలలోనూ మహిళల పాత్రను గర్వంగా గుర్తుచేశారు. నారీ శక్తి వందన్ అధినియమం (మహిళలకు శాసనసభలలో రిజర్వేషన్) చారిత్రక చట్టంగా పేర్కొన్నారు. సదస్సు ప్రాముఖ్యతను వివరిస్తూ పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభల మహిళా సాధికారత కమిటీల ప్రతినిధులు, 20కి పైగా రాష్ట్రాల నుండి నాయకులు పాల్గొన్నారన్నారు. ఈ కమిటీలు అపార్టీ విధానంలో పని చేస్తూ, మహిళలు మరియు పిల్లలు చివరి గ్రామం వరకూ లబ్ధి పొందేలా చట్టాలు, పథకాలు అమలు అయ్యేలా పర్యవేక్షిస్తాయని చెప్పారు.సదస్సు ప్రారంభానికి ముందు శ్రీ ఓం బిర్లా తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరుపతి భూమి — భక్తి, త్యాగం, మహిళా కృషికి ప్రతీక — కాబట్టి మహిళలు, పిల్లలను భారత అభివృద్ధి పథంలో కేంద్ర స్థానంలో ఉంచడానికి ఇది సరైన ప్రదేశమని స్పీకర్ వ్యాఖ్యానించారు.రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీ హబ్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్‌లో చేస్తున్న కృషి ప్రశంసనీయం అన్నారు . మహిళా స్వ శక్తీకరణ కోసం ప్రభుత్వ పథకాల ద్వారా సాధించిన పురోగతిని ఈ సందర్భంగా వివరించారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ కమిటీల చురుకైన సహకారాన్ని ఆయన అభినందించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సేవలు ఆంధ్ర మట్టికి గౌరవం అని పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ఈ సదస్సు మహిళా స్వ శక్తీకరణపై లోతైన చర్చలకు ముఖ్య వేదికగా నిలిచిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వాతంత్య్ర సమరయోధులు, సాహితీవేత్తలు, ఆధ్యాత్మిక నాయకులకు ఈ సందర్భంగా ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.భారత రాజ్యాంగం మహిళల హక్కులకు బలమైన పునాదులు వేసిందని, బీహార్ రాష్ట్రం 50% మహిళా రిజర్వేషన్ అమలు చేసిందని, దేశంలో 41.50 లక్షల మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారన్నారు. రామ్ మనోహర్ లోహియా గారి లైంగిక సమానత్వంపై దృక్పథాన్ని గుర్తుచేశారు. పార్లమెంటరీ కమిటీలు చట్ట మార్పులు, విధానాల సరళీకరణ, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ పథకాలు – జనధన్ యోజన, ఆవాస్ యోజన, నమో డ్రోన్ దీదీ – మహిళల ఆర్థిక స్వావలంబనలో మైలురాళ్లు అని వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని హైటెక్ సిటీ, శ్రీ సిటీ వంటివి మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. చట్టాలు మారడం సరిపోదని, సామాజిక అవగాహన పెరగాలి అని స్పష్టం చేశారు. ఇందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఎన్నిక దేశానికి ప్రేరణాత్మక ఉదాహరణ అని పేర్కొన్నారు. సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.భారత పార్లమెంట్ మహిళా సాధికారత కమిటీ చైర్ పర్సన్ పురందేశ్వరి మాట్లాడుతూ…… 2047 నాటికి వికసిత్ భారత్ యొక్క లక్ష్యాలను సాధించడంలో సమానత్వం, సమ్మిళితత్వం, సాధికారత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధి భారతదేశ జాతీయ వ్యూహంలో ఒక ముఖ్యమైన అంశమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ పేర్కొన్నారన్నారు. విద్య, పారిశ్రామికత, ఆరోగ్యం, డిజిటల్ అక్షరాస్యత ద్వారా మహిళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని , బేటీ బచావో, బేటీ పఢావో, స్టాండప్ ఇండియా, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాల అమలు ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో రాణి లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు వంటి మహిళల పాత్రను , మహిళలకు ఉన్న సామర్థ్యం ను వివరించారు.ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటోందని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కృషి చేస్తోందని తెలిపారు. అదేవిధంగా విద్య, డిజిటల్ రంగం, ఉద్యోగ అవకాశాలు, నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గృహ హింస చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం వంటి చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. 1997లో మహిళా సాధికారత కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ మహిళలకు సంబంధించిన అనేక సమస్యలపై 87 నివేదికలను సమర్పించిందని తెలిపారు. కమిటీ తన సిఫార్సుల ద్వారా విధానపరమైన మార్పులకు దోహదపడిందని పేర్కొన్నారు. నేడు జరుగుతున్న ఈ సమావేశం మహిళా సాధికారత కమిటీల చైర్ పర్సన్లను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా అనుభవాలను పంచుకోవడానికి, ఉత్తమ విధానాలను మార్పిడి చేసుకోవడానికి, సవాళ్లను పరిష్కరించడానికి సూచనలు చేయడానికి ఒక వేదికగా ఈ సదస్సు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. మహాత్మా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటలను గుర్తు చేస్తూ స్త్రీలకు సమానత్వం, న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర శాసన వ్యవహారాల శాఖా మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ సదస్సు మహిళలకు సురక్షితత, విద్య, నైపుణ్యాలు, అభివృద్ధిలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించే దిశగా చట్టసభ్యులందరినీ ఏకం చేస్తుందని తెలిపారు. ఇది వికసిత్ భారత్–2047, స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాల వైపు ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా చట్టసభ్యులు ఒకచోట చేరి మహిళా శక్తీకరణపై చర్చించడం కేవలం సామాజిక న్యాయం మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి పునాది అవుతుందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని మన ముందుకు ఉంచిందని, స్వాతంత్ర్యం శతాబ్దోత్సవానికి బలమైన, సమగ్రత కలిగిన అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ దిశలో మహిళా స్వ శక్తీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, బేటీ బచావో–బేటీ పడావో, మిషన్ శక్తి, వన్ స్టాప్ సెంటర్స్, మహిళా హెల్ప్‌లైన్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, పనిస్థల సురక్షిత పథకాలు వంటి పథకాల ద్వారా మహిళలకు భద్రత, గౌరవం, అభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.స్వర్ణ ఆంధ్ర–2047 సాధనలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, నాయకత్వం ముఖ్యమని, సంక్షేమం మరియు శక్తీకరణ కలిసిన రోడ్‌మ్యాప్‌తో రాష్ట్రం ముందుకు వెళ్తోందని తెలిపారు. రాష్ట్రంలోని సూపర్ సిక్స్ ఫ్లాగ్‌షిప్ పథకాలలో భాగంగా తల్లికి వందనం, దీపం–2, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి పథకాలతో పాటు పెన్షన్లు, ప్రసూతి సాయం, రైతు కేంద్రిత ప్రయోజనాలు మహిళలకు మేలు చేస్తోందని తెలిపారు. స్వర్ణ ఆంధ్ర–2047 ద్వారా మహిళలకు ఆరోగ్యం, పోషణ, భద్రత, సామాజిక రక్షణతో పాటు నైపుణ్యాధారిత విద్య, యూనివర్సల్ స్కూల్ చేరిక, డిజిటల్ క్లాస్‌రూమ్స్, స్కిల్ హబ్‌లు, టెక్నాలజీ ఆధారిత వైద్యం, ప్రసూతి ఆరోగ్యం, అనీమియా తగ్గింపు వంటి పథకాలు అమలవుతున్నాయని తద్వారా ప్రతి అమ్మాయి చదువు, ప్రతి మహిళ భద్రత, ప్రతి తల్లి ఆరోగ్యం, ప్రతి పారిశ్రామికవేత్తకు మార్కెట్, రుణాలు అందుబాటులో ఉంటాయన్నారు.ప్రపంచంలో వేగంగా మారుతున్న AI, బయోటెక్నాలజీ, డిజిటల్ ఎకానమీలో మహిళలు వెనుకబడకూడదని, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ లిటరసీ, STEM విద్య, క్వాంటం కంప్యూటింగ్ వంటి కొత్త నైపుణ్యాలలో పెట్టుబడులు పెడుతోందని వివరించారు. అయితే నిజమైన స్వ శక్తీకరణ పథకాల ద్వారానే కాదు, మనసులోని ఖచ్చితమైన మార్పు ద్వారానే ఇది సాధ్యమని, మహిళలను లబ్ధిదారులుగా కాకుండా సహభాగస్వాములుగా, నాయకులుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సదస్సు పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల జ్ఞానాన్ని కలిపే అపూర్వ అవకాశమని, తిరుపతిలో జరుగుతున్న చర్చలు స్పష్టమైన చర్యలకు దారి తీస్తాయని మంత్రి నమ్మకం వ్యక్తం చేశారు. భారతదేశంలోని ప్రతి మహిళ సురక్షితంగా, విద్యావంతులుగా, నైపుణ్యం కలిగి, శక్తివంతంగా ఉంటే వికసిత్ భారత్–2047, స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాలు తప్పక సాధ్యమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. చివరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రజల తరపున సదస్సుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ… మహిళా సాధికారత కోసం సమాన అవకాశాలు, సురక్షిత సమాజం, గౌరవమైన జీవితం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారం, పార్లమెంట్ మహిళా సాధికారత కమిటీ చైర్‌పర్సన్ దగ్గుపాటి పురందేశ్వరి, రాష్ట్ర కమిటీ చైర్మన్ చరిత రెడ్డి, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తదితరులకు అభినందనలు తెలిపారు.మహిళా సాధికారత జాతీయ సమావేశం తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మహిళలు సమాజ అభివృద్ధి కోసం తీర్మానాలు చేసి, ముందుకు నడిపించే శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరంలో, రాజ్యాంగ నిర్మాణంలో మహిళల కీలక పాత్రను గుర్తు చేస్తూ… దుర్గాబాయి దేశముఖ్ గారి సేవలు, రాజ్యాంగ కర్తగా చేసిన కృషిని స్మరించారు.స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సగం భాగం ఇచ్చే చట్టం చేశారన్నారు. ఉద్యోగాల్లో, చదువుల్లో రిజర్వేషన్లు కల్పించారని, ప్రతిభా భారతి గారిని స్పీకర్‌గా నియమించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమన్నారు. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా ఉపాధి, రాజకీయాల్లో ప్రాతినిధ్యం పెంచారని అభినందించారు. శాసనసభ సమావేశాలు కనీసం 60 రోజులు నిర్వహించాలన్నారు. అసెంబ్లీ సభ్యులు సభలోనే ప్రజా సమస్యలు చర్చించాలి, బయట మాట్లాడకుండా లోపల పరిష్కార మార్గాలు చెప్పాలన్నారు. మహిళల సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు నిర్ణీత సమయానికి, ఫలితాలు అందించేలా అమలు కావాలన్నారు. ఈసారి తమ ప్రభుత్వంలో మూడు మహిళలకు మంత్రిపదవులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రిని అభినందించారు. మహిళా సాధికారత సదస్సును ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించినందుకు లోక్‌సభ స్పీకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం మరియు సాధికారత కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి గౌరు చరితా రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా మహిళా సాధికారత విధానాలు, కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి, అనుభవాలు పంచుకోవడానికి, సవాళ్లపై చర్చించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు. మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం కోసం కమిటీ చేస్తున్న కృషిని తెలియజేస్తూ, మరింత మెరుగైన విధానాల అమలుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కమిటీ 1993 డిసెంబర్ 29న ఏర్పాటు కాబడి మహిళలు, చిన్నారుల సంక్షేమం, హక్కులు, రక్షణ, సాధికారతపై దృష్టి పెట్టిందన్నారు. మహిళలకు సురక్షిత వాతావరణం, విస్తృత అవకాశాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, దివ్యాంగులకు గౌరవం, సమాన అవకాశాలు, వయోవృద్ధులకు భద్రత కల్పించడం కమిటీ లక్ష్యాలన్నారు. విధానాల రూపకల్పన, సవరణలు, కొత్త కార్యక్రమాల అమలుపై సిఫార్సులను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. రాష్ట్రాలుగా విభజింపబడినప్పటికీ, మహిళలు, పిల్లల రక్షణ, దివ్యాంగుల సాధికారత, వయోవృద్ధుల భద్రత కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమగ్ర విధానాలను ప్రోత్సహించి, తగిన వనరులు కేటాయించి, వ్యవస్థలను బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళా సాధికారతకు పెద్ద పీట వేయడం, “డెవలప్మెంట్ నీడ్స్ ఉమెన్” అనే నినాదంతో పరిపాలన చేస్తున్నారని ప్రసంశించారు.ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణం రాజు సభకు హాజరైన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్ర స్థాయి మహిళా సాధికారత కమిటీలను పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీతో కలిపి, పవిత్రక్షేత్రమైన తిరుపతిలో ఈ సమావేశం నిర్వహించడం ఒక చారిత్రాత్మకమైన గట్టం అన్నారు. లోకసభ స్పీకర్ గౌరవనీయ శ్రీ ఓం బిర్లాజీ గారి ఆలోచన వల్లే ఈ విధమైన అద్భుతమైన కార్యక్రమం సాధ్యమైందని, ఈ పవిత్ర భూమి, దేవీ పద్మావతి అమ్మవారికి, శ్రీ వెంకటేశ్వరస్వామి ఇచ్చిన ప్రాధాన్యానికి ప్రసిద్ధి చెందినదన్నారు. అంతేకాకుండా, మన మహానీయ నాయకుడు గౌరవనీయ ఎన్టీ రామారావు గారు, ఇక్కడే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ఈ కార్యక్రమానికి మరింత విశిష్టతను తెచ్చిందన్నారు. లోకసభ స్పీకర్ బిర్లాజీ గారి ప్రేరణాత్మక ప్రసంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. రాజ్యసభ ఉపాధ్యక్షులు హరివంశ్‌జీ గారి సాన్నిధ్యం కూడా ఈ సభకు మరింత గౌరవాన్ని తెచ్చిందన్నారు. గౌరవనీయురాలు పురందేశ్వరి గారి అనుభవం, సేవలు, మరియు ఎన్టీఆర్ గారి కుమార్తెగా ఆమెకు ఉన్న ప్రత్యేకత, ఈ సభకు మరింత వెలుగును తెచ్చాయన్నారు. ఈ రోజు మన రాష్ట్రానికి చెందిన అనేక మంది గౌరవనీయులు, మంత్రులు, సహచరులు ఇక్కడ పాల్గొనడం, నిజంగా ఒక చారిత్రక ఘట్టం అని కొనియాడారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో మహిళలకు సమాన హక్కులు, ప్రాతినిధ్యం కల్పించడంలో మన ముఖ్యమంత్రి గారి కృషి గురించి హరివంశ్‌జీ విశేషంగా ప్రస్తావించడం చాలా గర్వకారణమన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ ఒక మైలురాయని, కానీ భవిష్యత్తులో రిజర్వేషన్ల అవసరం లేకుండా, మహిళలు 50% కంటే ఎక్కువ ప్రాతినిధ్యం పొందే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఉదయం ఆలయంలో మనందరితో పాటు ఉన్న శ్రీమతి సుధా నారాయణమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఆమె సాన్నిధ్యం ఈ సభకు గొప్ప గౌరవం తెచ్చి౦దన్నారు. చివరిగా ఈ సమావేశం కోసం మరియు ఈ ఉదయం స్వామివారి దర్శన ఏర్పాట్ల కోసం వారు అద్భుతమైన ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ , కమిషనర్ , టిటిడి చైర్మన్ , ఈఓ మరియు అదనపు ఈఓ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.మద్యాహ్న భోజన విరామ సమయంలో శాసనసభ స్పీకర్, డిప్యుటీ స్పీకర్ జిల్లా కలెక్టర్ తో కలసి భోజన ఏర్పాట్లను పరిశీలించి సదస్సుకు హాజరైన వారితో ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల డెలిగేట్లు, గూడూరు, సూళ్ళురుపేట, జి.డి. నెల్లూరు, రాప్తాడు, ఆళ్లగడ్డ, కడప జిల్లాల ఎమ్మెల్యేలు, యాదవ కార్పోరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర మీడియా కొ ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, జిల్లా అధికారులు, రాష్ట్ర శాసన వ్యవస్థకు సంబందించిన అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button