chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

లోక్‌సభ సభార్ధినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశాలు సెప్టెంబర్ 23, 24న విజయవాడలో– ఎంపీ బాలశౌరి

విజయవాడ, సెప్టెంబర్ 22:విజయవాడ నగరంలో సెప్టెంబర్ 23, 24 తేదీలలో లోక్‌సభ సభార్ధినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశాలు జరగనున్నట్లు మచిలీపట్నం ఎంపీ మరియు కమిటీ చైర్మన్ డా. వర్ణా బాలశౌరి వెల్లడించారు.

ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు 12 మంది లోక్‌సభ సభ్యులు హాజరుకానున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకింగ్, విద్యుత్, బీమా రంగాలపై విస్తృతంగా చర్చించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

బ్యాంకింగ్ రంగంపై చర్చ – సెప్టెంబర్ 23
సెప్టెంబర్ 23న నిర్వహించే సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌ల చైర్మన్‌లు, మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొననున్నారు. అలాగే, ఎన్టీపీసీ, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల సీఎండీలు కూడా సమావేశంలో పాల్గొంటారని ఎంపీ తెలిపారు.

ఈ సందర్భంగా బ్యాంకింగ్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, నూతన విధానాలు, సేవల విస్తరణపై లోతైన చర్చలు జరగనున్నాయని ఆయన వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి సహా అనేక బ్యాంకింగ్ ప్రముఖులు ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.

బీమా రంగంపై చర్చ – సెప్టెంబర్ 24
సెప్టెంబర్ 24న బీమా రంగానికి సంబంధించిన సంస్థలతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ప్రతినిధులు హాజరవుతారు.

బీమా రంగ అభివృద్ధి, రెగ్యులేటరీ సమస్యలు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రమైన చర్చలు జరగనున్నాయని బాలశౌరి తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker