ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR NEWS: అధికారులు తీరు మార్చుకుని ప్రజల కోసం పని చేయండి

JSP LEADERS PRESS MEET

ఈనెల 14వ తేదిన పిఠాపురంలో జరగబోయే 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని, ఆ సభకు రాష్ట్ర ప్రజలు అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఇంటర్నెట్, కేబుల్ అందించాలి అని సదుద్దేశంతో 2015 లో గతంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఉన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసి terasoft అనే కంపెనీతో కలిసి సుమారు 10 లక్షల కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం ఈ సంస్థని పూర్తిగా విస్మరించి, వారి నాయకులకు దోచిపెట్టే ఆదాయ వనరుగా మార్చుకుంది. అనవసరంగా ఉద్యోగులను నియమించుకుని, కొంత మందికి నియమించుకోకుండానే చట్టానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు సుమారు 4 కోట్లు జీతాలు పంచుకున్నారు.‌ అవి సరి చేయడానికి ప్రజలు కూటమి ప్రభుత్వంకి భాద్యతలు అప్పజెప్పారు. ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి అధికారులు సహకరించడం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ గతంలోనే అధికారులు తీరు మార్చుకోవాలని అని చాలా సార్లు చెప్పారు, కానీ చాలా మంది అధికారులలో మార్పు రాలేదు. అందుకు నిదర్శనం APSFC చైర్మన్ G.V.Reddy ఉదంతమే ఉదాహరణ అని అన్నారు. ఆయన రాజీనామా చేసినప్పటికీ తర్వాత కూడా అధికారుల తీరు మారలేదు అని అన్నారు. ఈ నెల కూడా పద్ధతి లేకుండా జీతాలు ఇచ్చే విషయాన్ని తప్పు పట్టారు. అధికారులు తీరు మార్చుకుని ప్రజల పక్షాన పని చేయాలి అని లేదంటే రాజీనామా చేసి కాంట్రాక్ట్స్ చేసుకోవాలి అని సూచించారు. తీరు మార్చుకోకుంటే ఖచ్చితంగా తద్వారా వచ్చే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker