ఆడబిడ్డలను ఆర్థికంగా బరోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.సూపర్ సిక్స్ సూపర్ హిట్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతమైనందుకు శుక్రవారం ఉదయం నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత వ్యవహారిక భాష ఉద్యమ పితామహులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి రాష్ట్ర మంత్రివర్యులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు భాష అభివృద్ధికి చేసిన సేవలను వారు కొనియాడారు.అనంతరం మంత్రివర్యులు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆడబిడ్డల్లో చైతన్యం తెచ్చి, మహిళలకు పద్మావతి విశ్వవిద్యాలయం నెలకొల్పి, రిజర్వేషన్లు, ఆస్తి హక్కును కల్పించిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు.
ఆడబిడ్డలను మరింత ముందుకు తీసుకుపోయిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కే దక్కుతుందన్నారు.
డ్వాక్రా సంఘాలను పెట్టడం, సాఫ్ట్వేర్ రంగంలో మహిళలకు ప్రోత్సహించి విదేశాలకు పంపడం, ఆడబిడ్డలు ఇబ్బంది పడకుండా దీపం పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ల సరఫరా, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు., తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 68 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద రాష్ట్రంలో ఉన్న బస్సులలో 74% బస్సులను కేటాయించారని, చిన్న చిన్న పనులు చేసుకునే మహిళలు 1500 నుంచి 2000 రూపాయల నెలవారీ ఖర్చులు ఆదా కావాలని, ఆ డబ్బులు వేరే విధంగా ఉపయోగించుకోవాలని, డ్వాక్రా సంఘాల ద్వారా వచ్చిన డబ్బుతో ఎం ఎస్ ఎం ఈ చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పట్ల మహిళల్లో అద్భుతమైన స్పందన ఉందన్నారు.రాబోయే రోజుల్లో మహిళలను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టబోతోందని వాటన్నిటిని మహిళలు అందిపుచ్చుకోవాలన్నారు..
యోగాంధ్ర కార్యక్రమంతో ప్రపంచ రికార్డు సృష్టించామని ప్రతి ఒక్క ఇంటిలో అందరూ యోగా సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమన్నారుగతంలో మచిలీపట్నం విజయవాడకు 4 వరుసల జాతీయ రహదారిని నిర్మించేందుకు కృషి చేశామన్నారు.
అలాగే నేడు మచిలీపట్నం విజయవాడకు 6 వరుసల జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్రమంత్రి నితిన్ ఘట్కరితో మాట్లాడామని, 2600 కోట్ల రూపాయల వ్యయంతో ఆ రహదారి మంజూరు చేయడం జరిగిందన్నారు.
మచిలీపట్నం నుండి రేపల్లె వరకు 45 కిలోమీటర్ల రైల్వే లైన్ పొడిగింపు కార్యరూపం దాల్చిందని, ఇందుకోసం 3 నెలల క్రితం కేంద్ర మంత్రితో మాట్లాడామని అన్ని ప్రయత్నాలు చేశామని 2 సంవత్సరాలలో పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందన్నారు. ఈ రైల్వే లైన్ కోసం పోరాటం చేసిన బందరు నివాసి కొక్కిలిగడ్డ కోదండరామయ్య నేడు చనిపోవడం బాధాకరమన్నారు.
రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తి పథకం
విజయవంతం అయిందన్నారు
రాష్ట్రంలో 10,500 బస్సులు ఉండగా అందులో 75% 8,500 బస్సులను మహిళల కోసం ఉచిత బస్సు పథకానికి కేటాయించామన్నారు
తాము అనుకున్న అంచనాలు మించిపోయాయని, రోజుకు ఆర్టీసీకి 5 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అంచనా వేశామని, అయితే 7.5 కోట్ల రూపాయల నష్టం వస్తుందన్నారు. ఇప్పటివరకు 2 కోట్ల 40 లక్షల మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకున్నారన్నారు. గతంలో బస్సులలో మహిళలు పెద్దగా లేకుండా వెలవెలబోయే వన్నారు. ప్రయాణించేది తక్కువగా ఉండేదని నేడు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తుండడంతో మహిళలు అధికంగా ప్రయాణం చేస్తున్నారన్నారు
ప్రస్తుతం ఉన్న బస్సులు చాలక పోవడంతో మరో 1,380 కొత్త బస్సులను సరఫరా చేయాలని ఉత్తర్వులు ఇచ్చామన్నారు
దశలవారీగా బస్సులు పెంచే ఏర్పాటు చేస్తామన్నారు బస్సుల కొరత లేకుండా చూస్తామన్నారు.
ఈ సందర్భంగా బందరువాసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు జీ ధనలక్ష్మిని మంత్రి , ఆర్టీసీ చైర్మన్ ఘనంగా శాలువతో ఘనంగా సత్కరించారు. తదనంతరం మహిళా లబ్ధిదారులకు మంత్రివర్యులు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మహిళలతో కలిసి మంత్రివర్యులు, ఆర్టీసీ చైర్మన్ గ్రూప్ ఫోటో దిగారు.తదుపరి మంత్రివర్యులు మహిళలకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, ఆర్టిసి ఆర్ఎం వెంకటేశ్వర్లు, డిఎం పెద్దిరాజు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, కార్పొరేటర్లు అనిత, సమతాకీర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు గొర్రెపాటి గోపీచంద్, రొండి కృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ గోపు సత్యనారాయణ, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు విద్యాసాగర్, స్థానిక నాయకులు ఫణి కుమార్ పలువురు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
2,297 2 minutes read