బాపట్ల జిల్లా:కర్లపాలెం- బలవర్ధకమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కర్లపాలెం ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు పరిశీలించారు.
శుక్రవారం స్థానిక కర్లపాలెం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ విద్యార్థులకి సాంకేతిక విద్యతోపాటు నైతిక విద్యను కూడా బోధిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు మండల విద్యాశాఖ అధికారి టి యు మనోరంజని పాల్గొని వడ్డించే పదార్థాలను పరిశీలించారు.