
బాపట్ల:వేమూరు:04-12-25:-దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య నాలుగో వర్ధంతి వేమూరులో గురువారం ఘనంగా నిర్వహించారు.
స్వగ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మెయిన్ రోడ్ వద్ద మరియు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రోశయ్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బొలిశెట్టి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, “డాక్టర్ రోశయ్య పరిపాలనలో దక్షుడే కాక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దారిచూపిన నాయకుడు. వేమూరు గ్రామ అభివృద్ధికి చేసిన సేవలు అపారమైనవి. కొందరు ఆయన కీర్తిని గుర్తించలేకపోవడం బాధాకరం” అని పేర్కొన్నారు.

ఆర్యవైశ్య సంఘం నాయకుడు నంబూరు గాంధీ మాట్లాడుతూ, “రోశయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నిలకడ తీసుకొచ్చి మంచి పేరు సంపాదించారు” అని అన్నారు.కార్యक्रमంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు బాదం వెంకటసుబ్బయ్య, తాళ్లూరు శ్రీనివాస్, కొమ్మూరి రమణ, నేరెళ్ల వెంకట సుబ్బారావు, అత్తోట శ్రీనివాస్, నారాయణ, గోనుగుంట్ల మురళి, కొమ్మూరి గోపి, కొలిపాకుల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.







