Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News:మహాశివరాత్రి తిరునాళ్లు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలి–ఎస్పీ ఉమామహేశ్వర్

బాపట్ల:- చిన్నగంజాం మండలంలో ఈ నెల 15న జరగనున్న మహాశివరాత్రి తిరునాళ్లను సాంప్రదాయ పద్ధతిలో శాంతి భద్రతల మధ్య నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సూచించారు. గురువారం ఆయన సోపిరాల గ్రామంలోని శ్రీరామ కోటేశ్వర స్వామి దేవస్థానం, కొత్తపాలెం గ్రామంలోని శ్రీ బాల కోటేశ్వర స్వామి వారి ఆలయాలను సందర్శించారు.

Bapatla Local News:మహాశివరాత్రి తిరునాళ్లు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలి–ఎస్పీ ఉమామహేశ్వర్

సోపిరాల ఆలయానికి విచ్చేసిన ఎస్పీ ఉమామహేశ్వర్‌కు పండితులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, విశ్రాంతి మున్సిపల్ కమిషనర్ టి.ఎస్.ఆర్. ఆంజనేయులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు ఆయనను ఆలయంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, మూలవిరాట్‌ను దర్శించుకున్నారు.

Bapatla Local News:మహాశివరాత్రి తిరునాళ్లు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలి–ఎస్పీ ఉమామహేశ్వర్

అనంతరం కొత్తపాలెంలోని శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఆయన సందర్శించారు. ఇరు ఆలయ కమిటీ పెద్దలతో కలిసి స్థానిక శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసి, తిరునాళ్ల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. పండుగను సాంప్రదాయబద్ధంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమన్వయంతో నిర్వహించాలని కోరారు.Bapatla Local News

ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్పీ, మండల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker