
విజయవాడ:12 నవంబర్ 2025:-కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు యత్నించిన మహిళను ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు.వివరాల్లోకి వెళ్తే — కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతానికి చెందిన ఒక వివాహిత, భర్తతో జరిగిన వాగ్వాదం తరువాత “చనిపోతాను” అంటూ విజయవాడకు చేరుకుని కృష్ణానది బ్యారేజ్ పై నుండి దూకేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో విధులు ముగించుకుని అక్కడివైపు వెళ్తున్న మహిళా ట్రాఫిక్ పోలీస్ జి. నవ్య (3250) ఆమె ఆత్మహత్యా యత్నాన్ని గమనించి, తక్షణమే స్పందించి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెనుకనుండి పట్టుకుని కిందకు దింపి రక్షించారు.
తర్వాత ఆమెను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పోలీసులు ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి, అనంతరం సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు.ఈ సంఘటనపై ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.ఒక ప్రాణాన్ని రక్షించిన మహిళా కానిస్టేబుల్ జి. నవ్య ధైర్యసాహసాలను ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్., ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షిరీన్ బేగం, ఐ.పి.ఎస్. మరియు ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.పోలీస్ అంటే కేవలం చట్టరక్షకులు కాదు — ప్రాణరక్షకులూ!” అని ఈ ఘటన మరోసారి నిరూపించింది.







