
ఎన్.టి.ఆర్: విజయవాడ:13-11-25:-విజయవాడ: మహిళలు, బాలికల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ మరియు సెల్ఫ్ డిఫెన్స్ ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ అధికారులు తెలిపారు.నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అడ్మిన్ డీసీపీ శ్రీమతి కె.జి.వి. సరిత, ఐపీఎస్ గారి మార్గదర్శకత్వంలో, మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీ టి. దైవప్రసాద్ పర్యవేక్షణలో శక్తి టీమ్ బృందాలు నగరంలోని పలు ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలల్లో మహిళలకు, విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ .మహిళలు ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకునే విధానాలు, శక్తి యాప్ ద్వారా పోలీసులను తక్షణమే సంప్రదించగల మార్గాలు వివరించారు.అలాగే 112 (అత్యవసర సేవలు), 1930 (సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం), 1098 (బాలల హెల్ప్‌లైన్), 181 (మహిళల హెల్ప్‌లైన్), 1073 (ట్రాఫిక్ సమాచారం కోసం), 101 (ఫైర్ ఎమర్జెన్సీ) వంటి టోల్-ఫ్రీ నంబర్ల ఉపయోగం గురించి తెలియజేశారు

.మహిళలు, యువతులు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా సోషల్ మీడియా మరియు సైబర్ నేరాల గురించి జాగ్రత్తలు పాటించాలని, చిన్నారులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు.పోక్సో చట్టం (POCSO Act) వివరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా వివరించారు.“మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి మహిళ తన భద్రతకు సాంకేతికతను ఉపయోగించుకోవాలి. శక్తి యాప్ వంటి పరికరాలు అక్రమార్కులపై ఆయుధంగా మారాలి” అని అధికారులు పేర్కొన్నారు.







