
బాపట్ల:- ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని వై జంక్షన్ వద్ద అటల్–మోది సూపర్ పాలన యాత్రలో భాగంగా మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి కొలుసు పార్థసారధి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

అలాగే బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర రాజు, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.TODAY BAPATLA NEWS
ఈ కార్యక్రమంలో జిల్లా శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










