chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

TENALI NEWS:మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుపై ఫేక్ పోస్టులు- తెనాలిలో కేసు నమోదు!

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు: డీఎస్పీ బి. జనార్ధనరావు – నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గారి ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై తెనాలి పోలీసులు కొరడా ఝుళిపించారు. ఈ వ్యవహారంపై తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు డీఎస్పీ బి. జనార్ధనరావు బుధవారం మీడియాకు వెల్లడించారు.

బాధ్యులపై విచారణ

మారీస్ పేటకు చెందిన వెనిగళ్ళ నారాయణరావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ (X) వేదికగా నాదెండ్ల భాస్కరరావు గారి పేరుతో ఒక ఫేక్ వీడియో హల్ చల్ చేస్తోందని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

TENALI NEWS:మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుపై ఫేక్ పోస్టులు- తెనాలిలో కేసు నమోదు!

వదిలే ప్రసక్తి లేదు

ఈ సందర్భంగా డీఎస్పీ బి. జనార్ధనరావు మాట్లాడుతూ.. “ట్విట్టర్‌లో ఈ తప్పుడు పోస్టు పెట్టిన వ్యక్తిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. నిందితులను త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని వదిలే ప్రసక్తి లేదు,” అని హెచ్చరించారు.

పోలీసుల విజ్ఞప్తి

సోషల్ మీడియాను వినియోగించే వారు బాధ్యతాయుతంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. “ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు అది నిజమో కాదో నిర్ధారించుకోవాలి. తప్పుడు సమాచారాన్ని, ఫేక్ వీడియోలను పంచుకోవడం నేరమని గుర్తుంచుకోవాలి,” అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు మరియు ప్రముఖులపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.Guntur news 18-01-2025 News Part-1 #gunturnews #ponnuru #tenali #mangalagiri #tadikonda #prathipadu

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker