
విజయవాడ, నవంబర్ 7:-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని గవర్నర్‌పేట ప్రాంతంలో నూతనంగా ప్రారంభమైన మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ఘనంగా ఆవిష్కృతమైంది. జైహింద్ కాంప్లెక్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన షోరూమ్‌ను సినీ నటి నిధి అగర్వాల్ మరియు ఈషా రెబ్బ ప్రత్యేక అతిథులుగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు.

ప్రారంభోత్సవ వేడుకకు అభిమానులు, స్థానికులు, యువత భారీగా తరలి వచ్చారు. హీరోయిన్స్‌ను చూసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా నిలిచి సందడి వాతావరణాన్ని సృష్టించారు.

ఈ సందర్భంగా నటి నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “పవన్ కల్యాణ్‌తో కలిసి నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నా కెరీర్‌లో ప్రత్యేకమైన మైలురాయి అవుతుంది” అని పేర్కొన్నారు. ఈషా రెబ్బ మాట్లాడుతూ, “విజయవాడ ప్రజల ఆతిథ్యాన్ని, ప్రేమను ఎప్పుడూ మరిచిపోలేను. మకుటశ్రీ షోరూమ్‌కు శుభాకాంక్షలు” అని అన్నారు.మకుటశ్రీ ప్రతినిధులు మాట్లాడుతూ, “వినూత్నమైన డిజైన్లు, నాణ్యత, పారదర్శక ధరలు మా షోరూమ్ ప్రధాన లక్షణాలు. వివాహాలు, పండుగలు, ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించాం” అని తెలిపారు.

అభిమానుల సందడి నడుమ చీర ముత్యాలతో అలంకరించిన మకుటశ్రీ షోరూమ్ ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. కొత్తగా ప్రారంభమైన ఈ జ్యువెలరీ మాల్ విజయవాడ ఆభరణాల మార్కెట్‌కు కొత్త ఊపును తెస్తుందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడ్డాయి.










