
గుంటూరు: నవంబర్ 11:-గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ముస్లిం మైనారిటీ నాయకులు, ఎన్డీయే నేతలతో కలిసి మౌలానా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు – “మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా రంగానికి బాటలు వేసిన మహానుభావుడు. విద్యే సాంఘిక సమానత్వానికి మూలం. హిందూ–ముస్లిం ఐక్యతకు మార్గదర్శకుడైన మౌలానా ఆజాద్ చూపిన దారిలో నడవడం ప్రతి భారతీయుడి బాధ్యత.”వేడుకలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, మైనారిటీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.







