
మంగళగిరి : 02-11-25:-మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో మంగళగిరిలో అయ్యప్ప స్వామి మహా పడిపూజా కార్యక్రమం నవంబర్ 4వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడనుంది.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, డప్పు శ్రీను భజనబృందం చే భక్తిని ఊరించే భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మంగళగిరి పరిసర ప్రాంతాల అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీలు మరియు భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని శ్రీ మధు నంబూద్రి గురుస్వామి కోరారు.







