
మంగళగిరి:09-11-25:- పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వద్ద ట్రాఫిక్ సమస్యలు భక్తులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆలయం ఎదురుగా ఉన్న రహదారి ఇరుకుగా ఉండటమే కాకుండా, ఒక వైపు ప్రైవేట్ వాహనాలు, మరో వైపు చిరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించుకోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.నో పార్కింగ్ జోన్‌గా ఉన్నప్పటికీ, ద్విచక్ర వాహనాలను ఆలయం ఎదుట యథేచ్ఛగా నిలుపుదల చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినప్పటికీ, దానిని విస్మరించి ఆలయ ద్వారం ముందు వాహనాలు నిలిపి ఉంచుతున్నారు.
ఇదంతా సరిపోక, తోపుడు బళ్ళు, సోడా బండ్లు, పూల మొక్కలు, పూల కుండీలు కూడా రోడ్డుపైనే ఉంచడంతో వాహనాల రాకపోకలు మరింత కష్టసాధ్యమవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, దేవస్థానం అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఈ పరిస్థితిని గమనించినా, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

.భక్తుల రాకపోకలకు అడ్డంకులు లేకుండా ఉండాలంటే, తక్షణమే రహదారి ఆక్రమణలను తొలగించి, కఠినమైన పార్కింగ్ నియమాలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.







