హైదరాబాద్:10-10-25:- రవీంద్రభారతిలో నిర్వహించిన తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ సమవర్తనోత్సవం (స్నాతకోత్సవం) సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ విభాగ డీన్ ప్రొఫెసర్ డా. కె. కృష్ణచైతన్య, తపస్య విద్యాసంస్థల డైరెక్టర్ ఓగూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి వేయి మంది పట్టభద్రులకు పట్టాలను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవాలని, సమకాలీన మార్పులను అవగాహన చేసుకొని పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలని సూచించారు.Hyderabad_Metro_Rail
“నాయకత్వ లక్షణాలను విద్యార్థులు అలవర్చుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి యువత పాత్ర ముఖ్యమైనది. విద్యాసంస్థలు మానవ విలువలతో కూడిన సమగ్ర విద్యను అందించేందుకు ముందుండాలి,” అని బాలకిష్టా రెడ్డి అన్నారు.
తెలంగాణలో తక్కువ కాలంలోనే తపస్య కళాశాలలు విస్తరించి, అత్యధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్లను తయారు చేసిన ఘనత ఈ సంస్థ యాజమాన్యానికి దక్కుతుందని ఆయన ప్రశంసించారు.