chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :మండల తహసిల్దార్ కార్యాలయాలలో నమోదైన ప్రతి అర్జీని పీజీఆర్ఎస్ పోర్టల్ లో నిక్షిప్తం చేయాలి-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి,

బాపట్ల : 15 డిసెంబర్ 2025:-రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల తహసిల్దార్ కార్యాలయాల్లో నమోదయ్యే ప్రతి అర్జీని తప్పనిసరిగా పీజీఆర్ఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. ఆదేశించారు.సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు వీక్షణ సమావేశం ద్వారా హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను వినతిపత్రాల ద్వారా కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపగా, మరికొన్నిటిని పరిశీలనకు, విచారణకు ఆదేశించారు. మొత్తం 173 అర్జీలు నమోదు అయ్యాయి.

Bapatla Local News :మండల తహసిల్దార్ కార్యాలయాలలో నమోదైన ప్రతి అర్జీని పీజీఆర్ఎస్ పోర్టల్ లో నిక్షిప్తం చేయాలి-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి,

రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అన్ని మండల కార్యాలయాల్లో తప్పనిసరిగా పీజీఆర్ఎస్ జరగాలన్నారు. అధికారులకు అందిన ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు ముందుగా తహసిల్దార్ కార్యాలయంలో అర్జీలు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీఓకు, అక్కడ కూడా పరిష్కారం లభించని పక్షంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలని వివరించారు. ఈ విధానం ప్రజలకు అర్థమయ్యేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.

సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. పంచాయతీ శాఖ, డీఆర్‌డీఏ, చీరాల మున్సిపాలిటీ, వేటపాలెం తహసిల్దార్ పరిధిలో పెండింగ్ అర్జీలపై ఆరా తీశారు. పునరావృత అర్జీలలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినవి 54 నమోదు కావడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్ అర్జీలపై ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించాలని సూచించారు.

ఇ-ఆఫీస్ విధానాన్ని అధికారులు అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ విధానంలో ఒకే రోజులో 9 గంటల్లో బాపట్ల జిల్లా నుంచి 1,363 ఫైళ్లను పరిశీలించి పరిష్కరించడం ద్వారా రాష్ట్రంలోనే 7వ స్థానం సాధించామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.Bapatla Local News ఖజానా శాఖలో ఇ-ఫైల్స్ నమోదు లేకపోవడంపై ఆరా తీసి, నిర్లిప్తత వహించకుండా కచ్చితంగా ఫైలింగ్ జరగాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా సంయుక్త కలెక్టర్, డీఆర్‌వో జి. గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంతరాజు తదితరులు పాల్గొన్నారు.

బాపట్ల 15 డిసెంబర్ 2025;-రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల తహసిల్దార్ కార్యాలయాల్లో నమోదయ్యే ప్రతి అర్జీని తప్పనిసరిగా పీజీఆర్ఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. ఆదేశించారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు వీక్షణ సమావేశం ద్వారా హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను వినతిపత్రాల ద్వారా కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపగా, మరికొన్నిటిని పరిశీలనకు, విచారణకు ఆదేశించారు. మొత్తం 173 అర్జీలు నమోదు అయ్యాయి.

రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అన్ని మండల కార్యాలయాల్లో తప్పనిసరిగా పీజీఆర్ఎస్ జరగాలన్నారు. అధికారులకు అందిన ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు ముందుగా తహసిల్దార్ కార్యాలయంలో అర్జీలు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీఓకు, అక్కడ కూడా పరిష్కారం లభించని పక్షంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలని వివరించారు. ఈ విధానం ప్రజలకు అర్థమయ్యేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.

సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. పంచాయతీ శాఖ, డీఆర్‌డీఏ, చీరాల మున్సిపాలిటీ, వేటపాలెం తహసిల్దార్ పరిధిలో పెండింగ్ అర్జీలపై ఆరా తీశారు. పునరావృత అర్జీలలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినవి 54 నమోదు కావడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్ అర్జీలపై ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించాలని సూచించారు.

ఇ-ఆఫీస్ విధానాన్ని అధికారులు అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ విధానంలో ఒకే రోజులో 9 గంటల్లో బాపట్ల జిల్లా నుంచి 1,363 ఫైళ్లను పరిశీలించి పరిష్కరించడం ద్వారా రాష్ట్రంలోనే 7వ స్థానం సాధించామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఖజానా శాఖలో ఇ-ఫైల్స్ నమోదు లేకపోవడంపై ఆరా తీసి, నిర్లిప్తత వహించకుండా కచ్చితంగా ఫైలింగ్ జరగాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా సంయుక్త కలెక్టర్, డీఆర్‌వో జి. గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంతరాజు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker