
మండవల్లి: జనవరి 18:-విశ్వవిఖ్యాత నటసార్వభౌములు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత స్వర్గీయ డా. నందమూరి తారఖరామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మండవల్లి మండలంలో ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, స్థానిక శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు మండవల్లి మండలంలోని మండవల్లి మరియు భైరవపట్నం గ్రామాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం డా. కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజల బాధలు, అవస్థలు చూడలేక తెలుగు ప్రజల కోసం కూడు–గూడు–గుడ్డ ఉండాలనే మహాసంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చి రూపాయికే కిలో బియ్యం పథకం, ఉచిత ఇళ్ల పట్టాలు, వృద్ధులకు పెన్షన్లు వంటి ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేసి చరిత్ర సృష్టించిన ఘనత ఒక్క అన్న ఎన్టీఆర్‌కే దక్కిందని తెలిపారు.Krishna Local News
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి కన్వీనర్ వీరమల్లి నరసింహారావు గారు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










